Saturday, November 3, 2007

naenu

చిత్రం.....విచిత్రం......
అదే నా గురించి నేను ఆలోచించిన క్షణం....
ఆలోచనల ప్రవాహంలొ ఒక నూతన అధ్యాయం....
"నాకు నేను ఏమౌతానని?"
నా చిరునవ్వుని అడిగా, నా కన్నీటిని అడిగా .......
"నాకు నేను ఏమౌతానని?"
చిరునవ్వు చిన్నబుచ్చుకుంది కన్నీరు కరిగిపోయింది నా ప్రశ్నను చూసి!!!!!!
నా శ్వాసను అడిగా .... నా నీడను అడిగా..........
"నాకు నేను ఏమౌతానని?"శ్వాస చిన్నగా నిట్టూర్చింది
నీడ నను విడిపోయింది
ఆలోచించా.... ఆవేదన చెందా ....
"నాకు నేను ఏమౌతానని?"
లొకాన్నంతటిని ప్రశ్నించా? నన్ను చూసి వెక్కిరించింది !!!!
సమాధానం ఇంతేనా అనే సందిగ్దంలొ కడకు
నా మనసు నన్ను చూసి నవ్వి ఏమని బుజ్జగించిందో తెలుసా?
తల్లీ!!! నీకు నువ్వే నేస్తానివి అని
విస్మయం చెందా..... కనులు తెరిచా....
స్వప్నంగ ఉన్న బంధాల కంటే నాతో నేను పెనవేసుకునే బంధం ముఖ్యమని..
కొత్తగా ఉంది.. వింతగా ఉంది...
నన్ను నేనే ప్రేమిస్తున్నాననే విషయం తెలుసుకొని
ఎంతవరకూ ఈ మజిలీ అని ప్రశ్నించవద్దు ??????
ఎందుకంటే నేను ఆశాజీవిని కాబట్టి ............. రాధ